తెలంగాణ

telangana

ETV Bharat / city

YS Sharmila Padayatra:'కేసీఆర్​ పాలన వ్యవసాయానికి శాపంగా మారింది'

YS Sharmila Padayatra: వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 55వ రోజు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మీదుగా సాగింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చి రొంపెడు వద్ద రైతు గోస మహా ధర్నాలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలన వ్యవసాయానికి శాపంగా మారిందని ఆరోపించారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Apr 14, 2022, 9:42 PM IST

YS Sharmila Padayatra: పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​కి చేత కావడం లేదా అని వైఎస్సార్​టీపీ అధినేత షర్మిల ప్రశ్నించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 55వ రోజు.. భద్రాద్రి కొత్తగూడెం జల్లాలో చేరి ఇల్లందు మండలం మీదుగా సాగింది. సీఎం కేసీఆర్​ పాలనలో వ్యవసాయం చేయడం శాపంగా మారిందని ఆరోపిస్తూ చర్చిరొంపెడు వద్ద రైతు గోస మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.

'వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా లక్షన్నర ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్​ది. ఆ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​కి చేత కావడం లేదా ? ఓట్ల కోసమే పోడు భూములకు పట్టాలని వాగ్దానం చేశారు. బ్రతుకు దెరువుగా ఉన్న భూమిని లాక్కునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది. మహిళలు అని చూడకుండా వారిపై దాడులు చేస్తూ జైల్లో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​ది.'

- షర్మిల, వైఎస్సార్​టీపీ అధినేత

సీఎం కేసీఆర్ పాలన తీరు ఆఫ్గనిస్థాన్​లోని తాలిబన్లను తలపిస్తోందని షర్మిల ఆరోపించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అంటూ.. ఆఫ్గనిస్థాన్​లా మార్చారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వైతెపా అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షం లేక ఆడిందే ఆట.. పాడిందే పాట తీరున ప్రభుత్వ పాలన మారిందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే వైతెపా లక్ష్యం అని అన్నారు.

ఇదీ చదవండి:గోదాముల్లో మాయమైన బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి: కిషన్ రెడ్డికి రేవంత్‌ లేఖ

ABOUT THE AUTHOR

...view details