ఖమ్మం నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న కృష్ణవేణి వీడీవోస్ కాలనీలోని ఓ బహుళ అంతస్తు భవనంలో నివాసముంటున్నారు. భవనంలోని చివరి అంతస్తులో వారి ప్లాట్ ఉంది. రోజు తాను తీసుకుంటున్న ఆహారంలో రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న కృష్ణవేణి.. తన కుటుంబం ఆరోగ్యం బాగుండాలంటే.. ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు మాత్రమే వాడాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అవి దొరకడం అరుదు. ఒకవేళ దొరికినా ధర ఎక్కువ. దీనికో ఉపాయం ఆలోచించారు ఆమె. ఇంటి మిద్దె(Terrace Garden in Khammam)పై రోజువారి అవసరమైన కూరగాయలను పండించడం మొదలు పెట్టారు. మొదట ఆకుకూరలు.. తర్వాత కూరగాయల సాగు(Terrace Garden in Khammam) ప్రారంభించారు.
డాబాపై సేంద్రీయ సాగు
కృష్ణవేణి మిద్దెతోటలో వంకాయ, బెండ, దొండ, దోసకాయ, టమాట, సోరకాయ, బీన్స్, కాకర, పొట్లకాయ, మిరప, మునగ తదితర కూరగాయల మొక్కలు నాటారు. పాలకూర, బచ్చలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలతో పాటు సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, జామ వంటి పండ్ల చెట్లనూ పెంచుతున్నారు. వాటికి సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడుతున్నారు. సస్యరక్షణకు వేపపిండి వినియోగిస్తున్నారు. ఇలా ఇంటిపైన సేంద్రీయ సాగు చేస్తున్నారు.
"మేం ఉండేది అపార్ట్మెంట్లో. మొక్కలు పెంచుకోవడానికి అనువైన స్థలం లేదు. అందుకే డాబాపై పెంచుకుందామనే ఆలోచన వచ్చింది. మా అపార్ట్మెంట్లో వాళ్లని అడిగాను. వారు ఆసక్తి చూపలేదు. అందుకే నేనే డాబాపై మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నాను. మొదట కూరగాయలు, ఆకుకూరలు పెంచాను. తర్వాత నెమ్మదిగా పండ్ల మొక్కలు పెంచడం మొదలుపెట్టాను. మొక్కలు పెంచడం ఆహారం కోసమే కాదు.. వాటి ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. మొక్కల మధ్య గడుపుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది".
-కృష్ణవేణి, మిద్దెసాగు చేస్తున్న మహిళ
మిద్దెసాగు వాట్సాప్ గ్రూపు
ఒక వృక్షశాస్త్ర అధ్యాపకురాలుగా పలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని కృష్ణవేణి.. మిద్దె సాగు(Terrace Garden in Khammam)పై ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంత మంది మిత్రులతో కలిసి మిద్దెసాగు(Terrace Garden in Khammam) అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఈ సాగు(Terrace Garden in Khammam)పై ప్రోత్సహిస్తున్నారు. ఆ గ్రూపులోని సభ్యులు సాగుపై అనుమానాలు నివృత్తి చేసుకుంటారు. అంతే కాదు విత్తనాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు. విపరీతమైన పురుగుల మందు వాడిని కూరగాయలు తినడం వల్ల అనారోగ్యం పాలవుతామని, ప్రధానంగా మిరప పంటకు అత్యధికంగా రసాయనాలు వినియోగిస్తారని కనీసం మిరపను అయినా ఇంట్లో కుండీల్లో(Terrace Garden in Khammam) పండించుకోవాలని సూచిస్తున్నారు.