ఖమ్మం జిల్లాలో ఇటీవలే ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాస్పదమైంది. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... సర్పంచ్‌ను అవమానించారని సీపీఎం నేతలు మండిపడుతున్నారు. సర్పంచ్‌ను వేదిక మీదికి అధికారులు పిలిచినా ఆమె రాలేదని జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజ్ తెలిపారు.
సర్పంచ్‌ను మంత్రి పువ్వాడ అవమానించలేదు : కమల్ రాజ్ - khammam latest news
ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అవమానించారంటూ... సీపీఎం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెరాస నేతలు స్పష్టం చేశారు.
సర్పంచ్‌ను మంత్రి పువ్వాడ అవమానించలేదు : కమల్ రాజ్
ఈ విషయంలో మంత్రి పువ్వాడపై సీపీఎం పార్టీ బురదజల్లే ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు. రాజకీయ పబ్బం కోసమే మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంలోనే ఎస్సీ వర్గాల అభివృద్ధి సాగుతోందన్న విషయం సీపీఎం నేతలు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సుడా ఛైర్మన్ బచ్చు విజయ్, మేయర్ పాపాలాల్, పార్టీ నేతలు మధు, ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్
Last Updated : Jul 24, 2020, 12:36 AM IST