తెలంగాణ

telangana

ETV Bharat / city

'పాసుపుస్తకం కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా.. పట్టించుకోండి' - ఖమ్మం జిల్లా వార్తలు

పెనుబల్లి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు ఆందోళనకు దిగింది. వారసత్వంగా తనకు వచ్చిన భూమిని సాగుచేయనివ్వకుండా రెండేళ్లుగా తన సోదరులు అడ్డుపడతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయపోరాటం చేద్దామంటే భూమికి సంబంధించిన పాసు పుస్తకం ఇవ్వకుండా అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది.

పాసుపుస్తకం కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా..  పట్టించుకోండి
పాసుపుస్తకం కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా.. పట్టించుకోండి

By

Published : Jul 17, 2020, 5:07 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు ఆందోళనకు దిగింది. తన భూమికి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని దూదిపాళ్ల కనకమ్మ ఆందోళన చేపట్టారు. తల్లి నుంచి వారసత్వంగా తనకు వచ్చిన ఆరు ఎకరాల భూమిని రెండేళ్లుగా సాగు చేయకుండా తన సోదరులు అడ్డుపడుతున్నారని వృద్ధురాలు ఆరోపించింది. ఇప్పుడు ఆ భూమి అంతా బీడుబోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తహసీల్దార్​ ఆ భూమిని చూసి బీడు భూమికి పాసు పుస్తకం ఇవ్వలేమని, ఎమైనా ఉంటే కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చారని వాపోయిది. కోర్టుకు వెళ్లే స్తోమత తనకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు గ్రామంలో విచారించి తనకు పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని వేడుకుంది. లేకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరు మున్నీరయింది.

ABOUT THE AUTHOR

...view details