వైరా నియోజవకర్గం ఏన్కూరులో కాంగ్రెస్ నుంచి 2వేలకు పైగా కుటుంబాలు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో తెరాసలో చేరాయి. మండల కాంగ్రెస్ నాయకుడు, జడ్పీటీసీ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. ఎన్ఎస్పీ కాలువ నుంచి కమ్మవారి కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించాలని పొంగులేటి కోరారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కేసీఆర్ అభివృద్ధిని చూసి ఇంత మంది పార్టీలో చేరడం అభినందనీయమని నామ నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల కంటే ఏన్కూరులోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గెలిచిన వెంటనే ఏన్కూరు మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్కూరు మండలాన్ని దత్తత తీసుకుంటా: నామ - 2019 ELECTIONS
ఎంపీగా విజయం సాధించిన వెంటనే ఎన్కూరు మండలాన్ని దత్తత తీసుకుంటానని ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తెలిపారు. ఎన్కూరు మండలంలోని 2 వేల కుటుంబాలు పొంగులేటి ఆధ్వర్యంలో తెరాసలో చేరాయి.
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి