లాక్డౌన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పువ్వాడ ప్రారంభించారు.
తల్లాడలో బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ - rice distribution in tallada
రాష్ట్రంలో లాక్డౌన్ దృష్ట్యా ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వ తరఫున చర్యలు తీసుకున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు.
తల్లాడలో బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ
గత పదిరోజుల లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గురువారం జరిగిన ప్రధానమంత్రి మోదీ సమీక్షలోనూ తెలంగాణ ప్రభుత్వ చర్యలను ప్రశంసించినట్లు తెలిపారు. కూపన్ల ఆధారంగా నిర్దేశించిన సమయంలో బియ్యం తీసుకెళ్లాలని లబ్దిదారులకు సూచించారు.
ఇవీచూడండి:'ఐకమత్య వెలుగులతో కరోనా చీకట్లపై పోరాటం'