తెలంగాణ

telangana

'అంగన్​వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'

By

Published : Jan 24, 2021, 4:39 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్​లో అంగన్​వాడీ టీచర్లు, ఆయాలతో మందకృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. వారికి కనీస వేతనమైనా ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేశారు.

manda krishna madiga demands Anganwadi staff should be recognized as government employees
'అంగన్​వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'

అంగన్​వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్​లో వారి సమస్యలు, ఆంక్షలపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అంగన్​వాడీ టీచర్లు దశాబ్దాలుగా కనీస వేతనమైనా లేకుండా వెట్టిచాకిరి చేస్తున్నారని మందకృష్ణ అన్నారు. వారి శాఖలకు సంబంధించిన పని కాకుండా.. ప్రభుత్వాలు అదనపు పనులు కేటాయిస్తున్నాయని ఆరోపించారు. వారి పట్ల కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమే కాకుండా.. పదవీ విరమణ బెనిఫిట్స్, పింఛన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు. అందుకోసం ఉద్యమాలు చేస్తామన్నారు.

ఇదీ చూడండి: రాజకీయ నేతలు వ్యాపారులుగా మారుతున్నారు : సామల వేణు

ABOUT THE AUTHOR

...view details