గిరిజన సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆ సంఘం నాయకులు విమర్శించారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్ర గిరిజన సంఘం మహాసభల గోడ పత్రికను మాజీ శాసనసభ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు.
గిరిజన మహాసభల గోడపత్రిక విడుదల - Girijana Sangam Wall Poster Release
వచ్చే నెల మొదటివారంలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర గిరిజన సంఘం రెండో మహాసభల గోడ పత్రికను గిరిజన సంఘం నేతలు ఆవిష్కరించారు.
గిరిజన మహాసభల గోడపత్రిక విడుదల
బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని జూలకంటి డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. ఖమ్మంలో రెండు రోజులపాటు నిర్వహించే మహాసభలకు ప్రజలు, గిరిజన ప్రతినిధులు పెద్దఎత్తున తరలి రావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.