సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ విషయంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. అశ్వాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
'భూసేకరణ విషయంలో సమగ్ర విధానం పాటించాలి' - సీతారామ ప్రాజెక్టు భూ సేకరణ
సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ విషయంలో సమగ్ర విధానం పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు భూసేకరణ విషయమై అశ్వాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
'భూసేకరణ విషయంలో సమగ్ర విధానం పాటించాలి
భూసేకరణ కోసం రాష్ట్రంలో అమలవుతున్న మెరుగైన పద్ధతులు, విధానాలను గమనించి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మట్ ప్రకారం సర్వే చేయిస్తామని తెలిపారు. సర్వే సమయంలో రైతులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. సందేహాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, పినపాక, మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.