CMR donation 50 lakhs: మన ఊరు-మన బడి కార్యక్రమానికి సీఎంఆర్ యాజమాన్యం 50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎంఆర్ ఛైర్మన్ మావూరి వెంకటరమణ, మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ బాలాజీ చెక్కు అందించారు. ఈ సందర్భంగా వ్యాపారమే కాకుండా సామాజిక అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావాలనే ఆశయంతో 50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు వెంకటరమణ తెలిపారు.
మన ఊరు మన బడి కార్యక్రమానికి సీఎంఆర్ యాజమాన్యం రూ.50లక్షల విరాళం - సీఎంఆర్ విరాళం
CMR donation 50 lakhs: సీఎంఆర్ ఫౌండర్, ఛైర్మన్ మావూరి వెంకటరమణ వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక దృక్పథమే విధిగా భావించారు. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఖమ్మం జిల్లాలోని మన ఊరు మన బడి కార్యక్రమానికి రూ. 50లక్షలు విరాళంగా ఇచ్చారు.
ఇటీవలే సీఎంఆర్ 19వ స్టోర్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి తలపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమానికి తన వంతు సాయంగా రూ. 50లక్షలు ఇచ్చారు. ఇలానే తమ వ్యాపార సంస్థలు ఉన్న ప్రతిచోట ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీఎంఆర్ ఛైర్మన్ మావూరి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: