పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలకు బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు అందజేశారు. వలస కూలీలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
వలస కూలీలకు ఏ కష్టమొచ్చినా మేమున్నాం: భట్టి - భట్టి విక్రమార్క వార్తలు
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో సీఎల్పీ నేత భట్టి పర్యటించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలకు బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు అందజేశారు. వలస కూలీలకు ఏ కష్టమొచ్చినా కాంగ్రెస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
బ్రాహ్మణపల్లి పర్యటించిన భట్టి విక్రమార్క
మధిర మండలం మర్లపాడు సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీస్ సిబ్బంది, వాలంటీర్లకు మాస్కుల, శానిటైజర్లు అందజేశారు. లాక్‌డౌన్ సందర్భంగా పేదలు, కూలీలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం, అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కోరారు.
ఇదీ చదవండి:సీమంతానికి వెళ్తుండగా ప్రమాదం.. గర్భిణీ మృతి