Bhadradri Temple:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వచ్చిన వరదలతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తుల రాక తగ్గడంతో విక్రయించేందుకు తయారుచేసిన సుమారు 5వేల లడ్డూలు పాడైపోయాయి. నిత్యం భద్రాద్రి రామయ్యకు రెండు నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తుంది. శని, ఆదివారాల్లో... ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆదాయం సమకూరేది.
రామయ్య సన్నిధిలో పాడైపోయిన సుమారు 5వేల లడ్డూలు - పాడైపోయిన భద్రాద్రి రామయ్య లడ్డూలు
Bhadradri Temple: గోదావరి వరదలతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తుల రాక తగ్గడంతో రామయ్య సన్నిధిలో సుమారు 5వేల లడ్డూలు పాడైపోయాయి. పాడైన లడ్డూలను తిరిగి వినియోగించాలని సిబ్బందిని ఏఈవో ఆదేశించారు. చెడిపోయిన లడ్డూలను తిరిగి ఇవ్వాలన్న అధికారుల నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
laddu
గోదావరి వరదలతో వారం రోజుల నుంచి రాములోరి సన్నిధికి ఆదాయం గణనీయంగా తగ్గింది. భక్తులు రాకపోవడం వల్ల లడ్డూల విక్రయాలు నిలిచిపోయాయి. పాడైన లడ్డూలను మళ్లీ ఉపయోగించాలని సిబ్బందిని ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్ ఆదేశించినట్లు సమాచారం. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు పాడైన లడ్డూలను.. అధికారులు ఆరబెట్టారు. చెడిపోయిన లడ్డూలను తిరిగి ఇవ్వాలన్న అధికారుల నిర్ణయంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: