సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో చేరిన బాలింత మృతి చెందింది. ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన కరీంనగర్‌కు చెందిన షహనాజ్‌కు వైద్యులు ఈ రోజు తెల్లవారుజామున శస్త్రచికిత్స చేసి శిశువును కాపాడారు. శస్త్రచికిత్స తర్వాత గుండెపోటుతో ఆమె మరణించింది.
షహనాజ్ గర్భవతిగా ఉన్న సమయంలో స్వైన్ ఫ్లూ సోకింది. అక్కడి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే బంధువులు ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.