కరీంనగర్లో బంద్.. బస్టాండ్లో బందోబస్త్ - కరీంనగర్ జిల్లా బంద్
సకల జనభేరి సభలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ హఠాన్మరణం కార్మిక లోకాన్ని కంటతడి పెట్టించింది. కరీంనగర్-2 డిపో డ్రైవర్ బాబు మృతికి నిరసనగా ఉమ్మడి జిల్లా బంద్కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది.
కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
కరీంనగర్-2 డిపో డ్రైవర్ బాబు మృతికి నిరసనగా ఆర్టీసీ ఐకాస ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ బస్సులు సజావుగా నడిచేందుకు బస్టాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భాజపా, తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అంతకుముందు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో బస్సులను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
- ఇదీ చూడండి : ఆమెను చంపితేనే "సుఖం"..!