కరీంగర్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగరవేసింది. మొత్తం 30 వార్డులున్న హుజూరాబాద్‌లో 21 స్థానాలు కైవసం చేసుకుంది. ఇందులో రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలినవాటిలో ఐదు భాజపా గెలుచుకోగా.. ఒక స్థానంతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 3 వార్డులను సొంతం చేసుకున్నారు.
అలాగే 30 వార్డులున్న జమ్మికుంటలో కూడా కారు టాప్ గేర్‌లో వెళ్లి విజయం సాధించింది. ఇక్కడ 22 వార్డులను అధికార పార్టీ దక్కించుకోగా.. మూడింట హస్తం పార్టీ, ఇతరులు ఐదింటిని కైవసం చేసుకున్నారు.