రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతంగా వరి పంటకు నష్టం వాటిల్లిందని.. సీఎం ఏరియల్ సర్వేచేసి రైతులను ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లచ్చక్కపేటలో.. దోమపోటుతో నష్టపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు. వరితోపాటు పత్తి రైతులను కూడా వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయన్నారు.
సీఎంకు ఎన్నికలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: ఎల్.రమణ
తెరాస ప్రభుత్వంపై రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ నిప్పులు చెరిగారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే ప్రగతిభవన్‌ను బద్దలు కొడతామని హెచ్చరించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే మెట్‌పల్లి, జగిత్యాల, కామారెడ్డిలో రైతులు ధర్నా చేసినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగాల్సింది దుబ్బాకలో కాదన్నారు. వర్షాలకు నష్టపోయిన పొలాలను పరిశీలించి అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే మెట్‌పల్లి, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో రైతులు ధర్నా చేసినట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే ప్రగతిభవన్‌ను బద్దలు కొడతామని రమణ హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. అన్నదాతలకు అండగా తెదేపా ఉందని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి:నారా లోకేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు