తెలంగాణ

telangana

ETV Bharat / city

సింగరేణి కార్మికుల కోసం ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు

సింగరేణి కార్మికులకు వైరస్​ సోకితే చికిత్స అందించేందుకు గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను అధికారులు సిద్ధం చేశారు. ఐసీయు కేంద్రంతో పాటు 31 వార్డులు అందుబాటులో ఉంచామని రామగుండం ఆర్జీ1 జీఎం తెలిపారు.

By

Published : Jul 15, 2020, 4:10 PM IST

గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో కరోనా వైద్యం కోసం ప్రత్యేక వార్డులు
గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో కరోనా వైద్యం కోసం ప్రత్యేక వార్డులు

కరోనా సోకిన సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించేందుకు గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని రామగుండం ఆర్జీ -1 జీఎం కాల్వల నారాయణ తెలిపారు. కొవిడ్​ బాధితుల కోసం సింగరేణి ఆస్పత్రిపై అంతస్తుతో పాటు ట్రాన్సిట్ గదుల్లో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఐసీయు కేంద్రంతో పాటు 31 వార్డులు అందుబాటులో ఉంచామన్నారు.

కొవిడ్-19 ప్రభావంతో వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రిలోనే వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆస్పత్రిలోని సౌకర్యాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్మికులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details