శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కరీంనగర్లో విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత వేడుకలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమాన్ని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి చిరంజీవులు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత వందేమాతరం శ్రీనివాస్, అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఘనంగా శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం - vc
కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వందేమాతరం శ్రీనివాస్, అనూప్ కుమార్ హాజరయ్యారు.
జ్యోతి వెలుగిస్తున్న అతిథులు
వార్షికోత్సవం జరపడం ఇదే మొదటిసారి కావడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నృత్యాలతో అలరించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక సమస్యలు పరిష్కరించానని చిరంజీవులు అన్నారు. వార్షికోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు.
ఇవీ చూడండి:19న హైదరాబాద్లో వీర హనుమాన్ శోభాయాత్ర
Last Updated : Apr 18, 2019, 7:52 AM IST