తెలంగాణ

telangana

ETV Bharat / city

పుట్టుకొస్తున్న అక్రమ లేఅవుట్లు.. పట్టించుకోని అధికారులు..

పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి అక్రమ లేఅవుట్​ దారులుకు అధికారులు నోటిసులు జారీ చేస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఈ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోందనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 59 లేఅవుట్లను గుర్తించినా అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

officers negligence on  illegal layouts
పట్టించుకోని అధికారులు

By

Published : Mar 4, 2020, 4:48 PM IST

అక్రమ లే అవుట్ల తొలగింపులో పెద్దపెల్లి జిల్లా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా లే అవుట్లను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రగతి కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమ లేఅవుట్లను తొలగించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ ప్రక్రియ మందకొడిగా సాగడం పట్ల విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

రామగుండం కార్పొరేషన్​తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ ప్రణాళిక అధికారులు ఇప్పటికే 59 లే అవుట్లను గుర్తించారు. వీటి గుర్తింపు, తొలగింపు ప్రక్రియలో ఎలాంటి అలసత్వం, రాజకీయం ఇతర ప్రలోభాలకు గురి కావద్దని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అయితే నిన్నటి వరకు ఈ లేఅవుట్ల యజమానులకు కొమ్ముకాసిన అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. నేటితో పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తికానున్న సందర్భంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పుట్టుకొస్తున్న అక్రమ లేఅవుట్లు

ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: మెట్రో ముందు జాగ్రత్త చర్యలు

ABOUT THE AUTHOR

...view details