కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో 23 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటూనే.. వచ్చే ప్రవాహాన్ని కిందికి వదిలిపెడుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్ సునీల్‌రావు, ఎల్‌ఎండీ ఎస్‌ఈ శివకుమార్‌తో కలిసి గంగుల గేట్ల వద్ద పూజలు చేశారు. అనంతరం మూడు గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆరువేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నామని.. పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
దిగువ మానేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం : గంగుల - minister gangula on kcr
కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు మంత్రి గంగుల కమలాకర్. జలాశయంలో నిత్యం 23 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
దిగువ మానేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం : గంగుల