తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెరాస ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తోంది'

కొండాలక్ష్మణ్​ బాపూజీ జయంతి సందర్భంగా కరీంనగర్​ బైపాస్​ రోడ్డులోని ఆయన విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్​ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెరాస ప్రభుత్వం ఆయన అడుగు జాడల్లోనే నడుస్తోందని ఆయన అన్నారు.

'తెరాస ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తోంది'

By

Published : Sep 27, 2019, 2:46 PM IST

ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టమైన నాయకుడని బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొంత మంది ఆయనను రాజకీయానికి వాడుకున్నారు కానీ తెరాస ప్రభుత్వం మాత్రం ఆయన అడుగు జాడల్లోనే నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్‌ బైపాస్‌రోడ్డులో కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌‌, నగర మున్సిపల్ కమిషనర్‌‌ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ మంత్రి పదవి జోలికి వెళ్లని ఆదర్శనాయకుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ అని ఆయన కొనియాడారు. చేనేత ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఆయనే ఆదర్శప్రాయుడని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

'తెరాస ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తోంది'
ఇదీ చదవండిః మృత్యువును జయించిన 10నెలల పసికందు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details