తెలంగాణలో 2500 సంవత్సరాల క్రితమే నాగరికత వెల్లివెరిసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. శాతవాహనులు, కాకతీయులు, చాళుక్యుల కాలంలో కట్టడాలు, దేవాలయాలు, శిల్పసంపదతో తెలంగాణ వైభవం వెలిగిపోయిందని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించబోయే తెలంగాణ వైభవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
తెలంగాణ వైభవం వేడుకలకు కిషన్రెడ్డి జ్యోతిప్రజ్వలన - TELANGANA VYBHAVAM
కరీంనగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ వైభవం కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 2500 సంవత్సరాల క్రితమే నాగరికత వెల్లివెరిసిందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ వైభవం వేడుకలకు కిషన్రెడ్డి జ్యోతిప్రజ్వలన
ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని... ప్రజ్ఞాభారతి ఆ ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు.
ఇవీ చూడండి:కార్పొరేట్ సుంకం తగ్గింపుపై ఎవరెవరు ఏమన్నారంటే..?