కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట మండలం మాదిపెల్లి గ్రామంలో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సీఐ సృజన్ రెడ్డిని హోంమంత్రి మహమూద్ అలీ అభినందించారు. బావిలోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న బాధితులను... ఎంతో ధైర్యంతో లోపలికి దిగి ప్రాణాలొడ్డి కాపాడటం ప్రశంసనీయమని మహమూద్ అలీ అన్నారు. ఆపదలో ఉన్న ఇద్దరి ప్రాణాలు కాపాడి పోలీసు శాఖకు మరింత మంచి పేరు తెచ్చారని సృజన్ రెడ్డిని హోంమంత్రి ప్రశంసించారు. సీఐకి తగిన రివార్డు ఇవ్వాలని కరీంనగర్ సీపీని మహమూద్ అలీ ఆదేశించారు. అంతేకాకుండా మెరిటోరియస్ సర్వీస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సీఐకి హోంమంత్రి మహమూద్ అలీ అభినందన - merit
బావిలో ఊపిరాడక ప్రాణాలు కొల్పోయే స్థితిలో ఉన్న ఇద్దరిని సీఐ కాపాడిన సంఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. సీఐ సృజన్ రెడ్డికి తగిన రివార్డుతో పాటు మెరిటోరియస్ సర్టిఫికెట్ ఇవ్వాలని కరీంనగర్ సీపీని ఆదేశించారు.
సీఐకి హోంమంత్రి మహమూద్ అలీ అభినందన