తెలంగాణ

telangana

ETV Bharat / city

జూనియర్ న్యాయవాదులకు నిత్యవసరాలు పంపిణీ - కరీంనగర్​ జిల్లా వార్తలు

లాక్​డౌన్ అమలవుతొన్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి జూనియర్ న్యాయవాదుల ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాన్ని అర్ధం చేసుకున్న బార్​ కౌన్సిల్​ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదగా బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేశారు.

groceries distribution to junior lawyers
జూనియర్ న్యాయవాదులకు నిత్యవసరాలు పంపిణి

By

Published : Apr 1, 2020, 2:33 PM IST

ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరు లాక్​డౌన్​ను విజయవంతం చేస్తేనే.. కరోనా మహమ్మారిని తరమికొట్టగలమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి తెలిపారు. లాక్​డౌన్ అమలవుతొన్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్న జూనియర్ న్యాయవాదులకు బియ్యం ఇతర వస్తువులు పంపిణీ చేశారు.

హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని కోర్టులు మూసివేసామని తెలిపారు. అత్యవసర కేసుల పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

జూనియర్ న్యాయవాదులకు నిత్యవసరాలు పంపిణీ

ఇవీ చూడండి:డ్రైవింగ్​ లైసెన్స్​ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.

ABOUT THE AUTHOR

...view details