తెలంగాణ

telangana

ETV Bharat / city

రామమందిర నిర్మాణంతో విశ్వ గురుస్థానంలో భారత్​: బండి సంజయ్​ - ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్​

అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఎంపీ బండి సంజయ్.. కరీంనగర్​లోని​ తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉద్యమంలో భాగంగా అప్పటి కరసేవలో పాల్గొనడం, అరెస్టు కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

bjp state president says that with the construction of ram mandir in ayodhya india will be at viswaguru position to the world
రామమందిర నిర్మాణంతో విశ్వ గురుస్థానంలో భారత్​: బండి సంజయ్​

By

Published : Aug 5, 2020, 3:02 PM IST

Updated : Aug 5, 2020, 5:44 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం శంకుస్థాపన సందర్భంగా కరీంనగర్​లోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సీతారాముల విగ్రహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా సాధుసంతుల నేతృత్వంలో జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితంగానే రామ జన్మభూమి ఉద్యమం ఫలప్రదమైందని స్పష్టం చేశారు. నాటి పాలకపక్ష తూటాలకు ఎంతో మంది అసువులు బాశారన్నారు. వారి త్యాగాల వల్లనే నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందన్నారు.

అయోధ్య ఉద్యమంలో భాగంగా అప్పటి కరసేవలో పాల్గొనడం.. అరెస్టు కావడం, మందిర నిర్మాణ ప్రారంభంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం ప్రారంభంతో హిందుత్వ భావన బలపడిందన్నారు. ప్రపంచంలోనే.. భారత్ విశ్వ గురుస్థానంలో దేదీప్యమానంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రామమందిర నిర్మాణంతో విశ్వ గురుస్థానంలో భారత్​: బండి సంజయ్​

ఇవీచూడండి:'హిందూ సంప్రదాయానికి ఆధునిక చిహ్నం రామాలయం'

Last Updated : Aug 5, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details