భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP TELANGANA STATE PRESIDENT BANDI SANJAY)తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర(PrajaSangramaYatra) 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా(RAJANNA SIRCILLA DISTRICT) తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి నుంచి పాదయాత్రం ప్రారంభమైంది. యాత్రకు ముందు బద్దెనపల్లి వద్ద చాకలి ఐలమ్మ(chakali ilamma jayanthi) జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
యాత్రకు సంఘీభావంగా..
మానేరు భూ నిర్వాసితులు(Manair land settlers) బండి సంజయ్(BANDI SANJAY) ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. బండి సంజయ్(BANDI SANJAY)ని కలిసి తమను విధుల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు.