MINISTER FIRES ON PAWAN COMMENTS: కొత్త ప్యాకేజీలో భాగంగానే చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొట్టు సత్యనారాయణ.. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్మాదుల్లా ప్రసంగాలు చేయరన్నారు. కాపు యువతను పెడదోవ పట్టించేలా ప్రవన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కర్రకు కర్ర, కత్తికి కత్తి, రాళ్లకు రాళ్లు అని ఎవరూ మాట్లాడరన్న ఆయన.. ఇవన్నీ ఉగ్రవాద చర్యలన్నారు.
పవన్ ఒక్కరే చెప్పులు చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత అసహనంతో మాట్లాడుతున్న పవన్‌ను రాజకీయ నాయకుడిగా ఎలా గుర్తిస్తారని మంత్రి ప్రశ్నించారు. రంగా హత్య కేసుతో సంబంధం ఉన్నవారితో పవన్ కల్యాణ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. అసహనం ఎక్కువై చెప్పులు చూపడానికి.. రాజకీయం సినిమా కాదని అన్నారు. జనసేన పార్టీలో ఎవరూ ఎదగకుండా.. అందరితోనూ చేతులు కలుపుతున్న పవన్ కల్యాణ్.. రాజకీయ వ్యభిచారి అని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా విమర్శించారు.