75వ స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం పంపడంలో ఎందుకు జాప్యం చేశారంటూ వైకాపా నాయకుడు వీరంగం సృష్టించిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని జగన్నాథపురంలో (లక్ష్మీపురం) ఆదివారం జరిగింది. గ్రామస్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు పి.అచ్చింనాయుడును జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుగత శ్రీను ఆదివారం ఉదయం సమాచారం పంపారు.
ఆహ్వానం ఎందుకు పంపలేదు.. టీచర్లపై వైకాపా నేత తిట్ల పురాణం
ఉపాధ్యాయులను గౌరవించాల్సింది పోయి.. పరుష పదజాలంలో దూషించాడు ఏపీలోని జగన్నాథపురంలో (లక్ష్మీపురం) ఓ వైకాపా నేత. రెండు రోజుల ముందే స్వాతంత్య్ర వేడుకలకు ఎందుకు ఆహ్వానం పంపలేదని విద్యార్థుల ముందే తిట్ల పురాణం అందుకున్నాడు. ఆఖరికి ఉపాధ్యాయులే క్షమించమని వేడుకోవాల్సి వచ్చింది.
అచ్చింనాయుడు వస్తూనే ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులపై పరుష పదజాలంతో పిల్లల ఎదుటే దూషించారు. రెండు మూడు రోజుల ముందుగా ఆహ్వానం పంపడం తెలియదా? జాప్యమెందుకు చేశారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమించాలని, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని ఉపాధ్యాయులు బతిమిలాడటంతో ఆయన నెమ్మదించారు.
ఇదీ చదవండి:COUPLE SUICIDE: కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..