తెలంగాణ

telangana

ETV Bharat / city

శివాలయంలో భవనానికి వైకాపా రంగులు - శ్రీఅర్ధనారీశ్వరాలయ ప్రాంగణంలో రైతు భరోసా కార్యాలయానికి వైకాపా రంగులు

ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ అర్ధనారీశ్వరాలయ ప్రాంగణంలో రైతు భరోసా కార్యాలయానికి వైకాపా రంగులు వేశారు. గుడిలో పార్టీ రంగులు వేయటమేంటని ఏవోను భక్తులు ప్రశ్నించారు.

ysrcp-colour-to-the-shiva-temple
శివాలయంలో భవనానికి వైకాపా రంగులు

By

Published : May 1, 2020, 2:13 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా దామలచెరువు-పాటూరు రహదారి పక్కన ఐరాల మండలం చుక్కావారిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శ్రీఅర్ధనారీశ్వరాలయ ప్రాంగణంలో రైతు భరోసా కార్యాలయానికి వైకాపా రంగులు వేయటం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది.

వేదగిరివారిపల్లి గుండ్లపల్లి పంచాయతీలతోపాటు దామలచెరువు గ్రామాల ప్రజలు ఇక్కడి స్వామివారికి పూజలు చేస్తారు. గర్భాలయానికి అనుబంధంగా ఓ దాత నిర్మించి ఇచ్చిన గదికి స్థానిక వైకాపా నేతలు రెండ్రోజుల కిందట పార్టీ రంగులద్ది.. రైతు భరోసా కేంద్రంగా చెబుతున్నారు. స్థానికులు ఇక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. ఏవోను ప్రశ్నించారు. గుడిలో గదికి పార్టీ రంగులు వేయడం ఏమిటని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details