ys viveka murder case in HC: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 2 వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని.. సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తూ... నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారితరఫున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, టీ.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
నిలువరించాలి
దస్తగిరి నిందితుడిగా చెప్పిన విషయాన్ని సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలంగా నమోదు చేసి సంబంధిత కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఓసారి 164 వాంగ్మూలం నమోదు చేశాక.. అప్రూవర్‌గా మారారని మరోసారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దిగువ కోర్టు దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేయబోతుందని.. దానిని నిలువరించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.