హైదరాబాద్ కైతలాపూర్‌లో మద్యం దుకాణంలో కొందరు యువకులు బీర్లు కొనుగోలు చేశారు. వాతావరణం బాగుందని భావించి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోని ఓ చెట్టు కింద సిట్టింగ్ వేశారు. కబుర్లు చెప్పుకుంటూ మద్యం సేవిస్తున్న వారు.. పోలీసులు రావడం చూసి అక్కణ్నుంచి పరారయ్యారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఆ యువకులను పోలీసులు వెంబడించారు కానీ.. వారు చాకచక్యంగా తప్పించుకోవడం వల్ల పట్టుకోలేకపోయారు. పోలీసులు వెళ్లడం గమనించిన ఆ యువకులు.. మళ్లీ ఆ స్థలానికి వెళ్లి మద్యం సీసాలు తీసుకువెళ్లారు.
బహిరంగ ప్రదేశంలో మందుబాబుల సిట్టింగ్.. పోలీసులు రాగానే పరార్
వెదర్ బాగుందని మద్యం షాపుకు వెళ్లారు. చల్లగాలిలో చిల్డ్ బీర్ తాగుదామని షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మద్యం సేవించారు. సడన్‌గా పోలీసులు రావడం చూసి అక్కణ్నుంచి క్షణంలో పరారయ్యారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను హైదరాబాద్‌లోని కైతలాపూర్ పోలీసులు తరిమికొట్టారు.
మందుబాబుల సిట్టింగ్, బహిరంగంగా మందుబాబుల సిట్టింగ్
కైతలాపూర్ మద్యం దుకాణాల వద్దకు వెళ్లిన పోలీసులు.. బహిరంగంగా మద్యం సేవించడాన్ని ప్రోత్సహించకూడదని యజమానికి సూచించారు. పర్మిట్ రూంలోనే ఉండాలని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విక్రయాలు జరపాలని చెప్పారు.