తెలంగాణ

telangana

ETV Bharat / city

మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త - మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా జాగ్రత్త

మీరు బ్లూ ఫిలిమ్స్​ చూస్తున్నారా.. జాగ్రత్త.. ఎందుకంటే సందట్లో సడేమియా అన్నట్టుగా.. లాక్​డౌన్​ సమయంలో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీరు పోర్న్​ చిత్రాలు చూస్తున్న వీడియోలు మీ సన్నిహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పలువురు బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

you see blue films beware of cyber crime
మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

By

Published : Apr 17, 2020, 11:13 AM IST

‘మీరు నీలిచిత్రాలు చూస్తున్నారు.. మీ కంప్యూటరు, ల్యాప్‌టాప్‌ను హ్యాక్‌ చేసి వెబ్‌ కెమెరా ద్వారా చిత్రీకరించాం... మా ఖాతాలో వెయ్యి డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో బదిలీ చేయకపోతే... మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వీడియోలు పంపుతాం’ అంటూ సైబర్‌ నేరస్థులు బెదిరిస్తున్నారు. చూడని వాళ్ల మెయిల్‌ ఐడీలకు కూడా ఇలా బెదిరింపు సందేశాలను పంపుతున్నారు. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను చూస్తున్నప్పుడు, వీడియో లింకులు పంపుతున్నారు.

మెయిళ్లు అందుకున్న కొందరు భయపడిపోయి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ విశ్రాంత అధికారి, నిన్న ఒక యువతి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు వివరించారు. బలహీన మనస్కులు, అమ్మో.. నీలిచిత్రాలా? అని భయపడి తమకు డబ్బు పంపుతారన్న అంచనాతోనే ఇలా చేస్తున్నారని బెదిరింపులకు భయపడొద్దని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. పాస్‌వర్డ్‌ మార్చుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి :ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

ABOUT THE AUTHOR

...view details