తెలంగాణ

telangana

ETV Bharat / city

Mlc Elections: వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే? - వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఏపీలోని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార వైకాపా ప్రకటించింది. శ్రీకాకుళం నుంచి డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఇషాక్‌ బాషా, కడప జిల్లా బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఖరారయ్యారు.

ysrcp announced MLC candidates
ysrcp announced MLC candidates

By

Published : Nov 10, 2021, 10:36 PM IST

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. మూడు ఖాళీలను భర్తీ చేసేందుకు ముగ్గురు అభ్యర్ధుల పేర్లను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఇషాక్‌ బాషా, కడప జిల్లా బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్లను తమ పార్టీ అధినేత జగన్మోహన్​రెడ్డి ఖరారు చేశారన్నారు.

స్థానిక సంస్థలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను రెండు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని.. రిజర్వేషన్లు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే పేర్లను ప్రకటిస్తామన్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి.

ఇదీచూడండి:మరియమ్మ మృతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. గుండె ఆగిపోయేలా కొడతారా?

ABOUT THE AUTHOR

...view details