తెలంగాణ

telangana

ETV Bharat / city

YCP leader video viral: కారు షాపు యజమానిపై వైకాపా నేతల దాడి.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - ఆటోనగర్​లో వైకాపా అనుచరుల దాడి

YCP leader video viral: ఓ కార్ వాషింగ్ షాపు యజమానిపై వైకాపా నేత, అతని అనుచరులు దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలో కలకలం రేపుతోంది. స్థలం ఖాళీ చేయాలని స్థానిక వైకాపా నేత గల్లా రవి బెదిరించాడని షాపు యజమాని సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

YCP leader video viral
కార్ వాషింగ్ షాపు యజమానిపై వైకాపా నేత దాడి

By

Published : Mar 1, 2022, 4:48 PM IST

YCP leader video viral: ఏపీలోని విజయవాడ ఆటోనగర్​లోని ఓ కార్ వాషింగ్ షాపు యజమానిపై వైకాపా నేత, తన అనుచరులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఆటోనగర్ జంక్షన్​లో కార్ వాషింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు . అతని షాపు వెనుక ఉన్న ఇరిగేషన్ స్థలంలో తనకు సంబంధించిన కార్లు పార్కింగ్ చేసుకుంటున్నాడు. స్థానిక వైకాపా నేత గల్లా రవి, తన అనుచరులతో షాపు వద్దకు వచ్చి సాంబశివరావు, అతని సిబ్బందిపై దాడి చేశారు.

పోలీసులకు ఫిర్యాదు...

ఈ ఘటనపై పటమట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ దాడి చేశారని ఫిర్యాదులో తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు గల్లా రవి, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.

కారు షాపు యజమానిపై వైకాపా నేత దాడి

ఇదీ చదవండి: AP CRIME NEWS: పోరురాజు తిరునాళ్లలో అపశృతి.. ఆర్టీసీ బస్సు కింద పడి బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details