తెలంగాణ

telangana

ETV Bharat / city

'మీరే ఆదుకోవాలి సీఎంగారు ... లేకుంటే ఆత్మహత్యే శరణ్యం' - ఎమ్మెల్యే శ్రీదేవిపై వైకాపా నేత ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్​లోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డబ్బులు తీసుకొని మోసం చేశారని వైకాపా నేత మేకల రవికుమార్ ఆరోపించాడు. కోటి రూపాయలు తీసుకొని తిరిగి చెల్లించటం లేదంటూ ఓ వీడియో విడుదల చేశాడు.

ycp-leader-alleged-on-tadikonda-mla-sridevi
'మీరే ఆదుకోవాలి ముఖ్యమంత్రిగారు ... లేకుంటే ఆత్మహత్యే శరణ్యం'

By

Published : Sep 13, 2020, 8:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మోసం చేశారని... గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కళ్లు గ్రామానికి చెందిన వైకాపా నేత మేకల రవికుమార్​ ఆరోపించాడు. సదరు వ్యక్తి గుంటూరు డీసీఎంఎస్​ డైరెక్టర్​గా పని చేస్తున్నాడు. అయితే ఎన్నికల సమయంలో శ్రీదేవికి అప్పుగా కోటి రూపాయలు ఇచ్చానని తెలిపాడు. సీఎం జగన్​ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.

ఎన్నికల వేళ అప్పు చేసి శ్రీదేవికి కోటి రూపాయలు ఇచ్చాను. ఆమె గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పటివరకు మొత్తం 60 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చారు. మిగతావి అడిగితే ఇచ్చేదేమీ లేదని అంటున్నారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో.. డీసీఎంఎస్​ పదవి ఇప్పించానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను దళిత కులానికి చెందినవాడిని. తిరిగి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాను. ముఖ్యమంత్రి జగన్​ ఆదుకోవాలి.

-మేకల రవి కుమార్, బాధితుడు(వైకాపా నేత)

'మీరే ఆదుకోవాలి ముఖ్యమంత్రిగారు ... లేకుంటే ఆత్మహత్యే శరణ్యం'

ఇదీ చదవండి:నీటి కోసం 30 ఏళ్ల పాటు కాలువ తవ్విన భగీరథుడు

ABOUT THE AUTHOR

...view details