తెలంగాణ

telangana

ETV Bharat / city

'చెప్పినట్టు వింటే సరేసరి... లేకపోతే..' పాల వ్యాపారిపై కౌన్సిలర్ దౌర్జన్యం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Councilor Attack: పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కౌన్సిలర్ దాడి చేశాడు. పాల బూత్ ఖాళీ చేయిస్తానని బెదిరించాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు దిగాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది.

ycp-counselor-attack-on-milk-selling-woman-and-her-family-in-palnadu
ycp-counselor-attack-on-milk-selling-woman-and-her-family-in-palnadu

By

Published : May 8, 2022, 1:12 PM IST

'చెప్పినట్టు వింటే సరేసరి... లేకపోతే..' పాల వ్యాపారిపై కౌన్సిలర్ దౌర్జన్యం

Councilor Attack: ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైకాపా కౌన్సిలర్ దాడి చేశాడు. గత కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్‌... నిన్న సాయంత్రం గొడవకు దిగాడు. 'చెప్పినట్టు వింటే సరేసరి... లేకపోతే.. పాల బూత్ ఖాళీ చేయిస్తా'నని బెదిరింపులకు దిగాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఇరువురిని పోలీసులు ఠాణాకు తరలించారు. ఆ తర్వాత కౌన్సిలర్ భార్య, కుమారుడు షాపులో ఉన్న తన భర్త, కుమారుడిపై దాడి చేశారని బాధిత మహిళ వాపోయింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్నా.. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details