తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్​మోహన్ రెడ్డి చేతకానితనంతోనే.. ఏపీలో ఆర్థిక సంక్షోభం: యనమల

Yanamala fire on AP GOVT: ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చేతకానితనంతోనే.. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్ధితిపై వైకాపా ప్రభుత్వం నిజాలను తొక్కిపెట్టి అసత్యాలు వల్లె వేస్తోందని విమర్శించారు.

జగన్​మోహన్ రెడ్డి చేతకానితనంతోనే.. ఏపీలో ఆర్థిక సంక్షోభం: యనమల
జగన్​మోహన్ రెడ్డి చేతకానితనంతోనే.. ఏపీలో ఆర్థిక సంక్షోభం: యనమల

By

Published : Feb 18, 2022, 4:12 PM IST

Yanamala fire on AP GOVT: జగన్​మోహన్ రెడ్డి అహంభావం, చేతగానితనం, మొండితనంతో మూడేళ్ల పాలనలో ఏపీలో మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం నెలకొందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏపీ ఆర్థిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెట్టి.. వైకాపా నాయకులు అసత్యాలు వల్లె వేస్తున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3ఏళ్లలో తెదేపా హయాం కంటే రూ. 86,865కోట్లు అధికమని తెలిపారు. కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆదాయంలో అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉన్నా.. పనితీరు, వివిధశాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉందని యనమల మండిపడ్డారు.

ద్రవ్యలోటు పెరిగిపోయింది..

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొవిడ్ ప్రభావం ఏపీపై తక్కువేనని తెలిపారు. రెవెన్యూలోటు 2021-22లో రూ. 52, 291కోట్లు అధికంగా పెరిగిందని తెలిపారు. ద్రవ్యలోటు రూ. 43,386కోట్లు అధికంగా పెరిగిందని వాపోయారు. గ్యారంటీ బడ్జెట్ మ్యాన్యువల్ పరిమితి 90శాతం నుంచి 180శాతానికి పెరిగాయని యనమల వివరించారు. సహజ వనరులను జే... గ్యాంగ్ నిలువు దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీసే దుస్థితికి తెచ్చారని దుయ్యబట్టారు.

దోపిడీ కారణంగానే..

జగన్​మోహన్ రెడ్డి ఆయన అనుచరుల దోపిడీ కారణంగానే రాష్ట్ర ఆదాయాలు అడుగంటాయన్నారు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని తెలిపారు. మొత్తం వ్యయం వైకాపా 3ఏళ్లలో రూ. 1,63,959 కోట్ల నుంచి రూ. 2,24,226కోట్లకు పెరిగాయని ఆక్షేపించారు. ప్రత్యక్ష నగదు బదిలీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు. 3ఏళ్లలో మొత్తం అప్పులు రూ. 4,83,791కోట్లు తెస్తే, సంక్షేమంపై ఖర్చుచేసింది కేవలం రూ. 1.20లక్షల కోట్లేనని తెలిపారు. మిగిలిన రూ. 3,63,791కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయని నిలదీశారు.

కరోనా కన్నా.. జగోనా దుష్ఫలితాలే ఈ దుస్థితికి కారణం

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం గినీ అసమానతలు 34వ స్థానం నుంచి 43కు ఎగబాకాయని యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్నారు. పొదుపుశక్తి పూర్తిగా మందగించిందని తెలిపారు. గత 3ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి మచ్చుకైనా లేకపోవడంతో దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలైందని యనమల విమర్శించారు. కరోనా కన్నా... జగోనా దుష్ఫలితాలే ఈ దుస్థితికి కారణమని ఎద్దేవాచేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details