పీరియడ్స్ ఆగిపోయే సమయం(మెనోపాజ్ దశ)లో ఇలా నెలసరి క్రమం తప్పడం, అధిక రక్తస్రావం కావడం లాంటివి సాధారణంగా కనిపించే లక్షణాలే. హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఇలా జరుగుతుంది. మీ విషయంలో అధిక రక్తస్రావంతోపాటు భరించలేని నొప్పి కూడా ఉందని చెబుతున్నారు కాబట్టి సమస్య ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు అవసరమవుతాయి. ముందుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయాలి. ఈ రక్తస్రావం వల్ల రక్తహీనత ఏర్పడిందా.. లేదా అనీమియా వల్లే ఇలా ఎక్కువ రక్తస్రావం జరుగుతుందా తెలుసుకోవాలి. మీరు చేయించుకోవాల్సిన రెండో పరీక్ష థైరాయిడ్ టెస్ట్. ఈ మధ్య కాలంలో ఏమైనా థైరాయిడ్ సమస్యలు మొదలయ్యాయా అని తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేయించుకోవాలి.
ఆ సమస్యతో... కూర్చుంటే లేవలేకపోతున్నా!
నెలసరిలో పది రోజుల వరకూ స్రావమవుతూనే ఉందా. ఆ సమయంలో చాలా మంది మహిళకు నెలసరి సమయంలో పది రోజుల వరకు రక్త స్రావమవుతూనే ఉంటుంది. ఈ సమయంలో నడుము, పొత్తికడుపులో విపరీతమైన నొప్ఫి వస్తుంది. కొన్ని సార్లు నేల మీద కూర్చుంటే లేవలేని పరిస్థితి నెలకొంటుంది. యాభై ఏళ్ల వయస్సులోని మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ గైనకాలజిస్టు అనగాని మంజుల సూచిస్తున్నారు.
మూడోది అల్ట్రా సౌండ్ పెల్విక్ టెస్ట్... స్కానింగ్‌లో అండాశయం, గర్భాశయం లోపల ఏమైనా కణతులు, గడ్డలు లాంటివి ఉన్నాయా తెలుస్తుంది. దాని ప్రకారం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వయసులో అధిక రక్తస్రావం అవుతుందంటే మరొక రెండు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకటి పాప్‌స్మియర్ పరీక్ష... ఈ టెస్ట్ చేయడం వల్ల గర్భాశయ ముఖద్వారానికి సంబంధించి సమస్యలన్నీ బయటపడతాయి. రెండోది... డీ అండ్ సీ (డైలటేషన్ అండ్ క్యూరెటేజ్ ). దీన్ని గర్భాశయ లోపలి పొర పరీక్ష అని కూడా అనవచ్ఛు ఇందులో ఏం చేస్తారంటే... గర్భాశయంలో నుంచి చిన్న ముక్కను తీసి బయాప్సీకి పంపిస్తారు. దీని ద్వారా హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఇలా జరుగుతుందా లేక ఇతర కారణాలున్నాయా అనే విషయం తెలుస్తుంది. యాభై ఏళ్ల వయసులో కలిగే ఈ అధిక రక్తస్రావాన్ని మాత్రం అశ్రద్ధ చేయకూడదు.
డాక్టర్ అనగాని మంజుల, సైకాలజిస్టు