హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే తనకు కూడా వైరస్ సోకుతుందన్న భయంతో.. విజయ(50) అనే మహిళ పురుగుల మందు తాగింది.
'కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ'
కరోనా భయం ప్రాణాలు తీస్తుంది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి వైరస్ సోకగా.. తనకు కూడా సోకుతుందేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లోని మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
'కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ'
గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న మలక్పేట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.