పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన మహిళలు మంత్రిని సన్మానించారు. ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
'పేదలను ఆదుకోవటంలో తెరాస ప్రభుత్వం ముందుంటుంది' - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన మహిళలు... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సన్మానించారు. ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉండి ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు రూ.550 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస ఇంఛార్జీ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు అత్తిలి అరుణగౌడ్, నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మి, ఆకుల రూప, కుర్మ హేమలత, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.