ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగ లక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని 'స్పందన' కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్‌ను వేడుకుంది.
పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. "మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు" అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు.