తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇవాళ్టి నుంచి ఏపీఎస్​ ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత - తెలంగాణ వార్తలు

కరోనా కేసులు ఎక్కువ అవుతున్న దృష్ట్యా ఏపీఎస్​ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం 12 లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తోంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.

Withdrawal of AP RTC advance reservations, ap rtc
ఏపీ ఆర్టీసీ రిజర్వేషన్లు రద్దు, ఏపీ ఆర్టీసీ

By

Published : May 5, 2021, 2:43 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్ర ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దుచేసింది. దూరప్రాంతాలకు తిరిగే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు సమకూర్చనున్నారు. మధ్యాహ్నం 12 లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత గమ్యస్థానాలు చేరుకునే దూరప్రాంత బస్సు సర్వీసులను రద్దు చేశారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:తండ్రి చితిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details