మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రాగల మూడ్రోజులు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.
మళ్లీ వరుణ ప్రతాపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం
తెలంగాణలో రాగల మూడ్రోజులు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలో మళ్లీ వరుణ ప్రతాపం
బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇది ఎత్తుకి వెళ్లే కొద్ది దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉందని వెల్లడించారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారిందని వాతావరణ కేంద్రం వివరించింది.