తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్వాన్​లో రెండు పడక ఇళ్లను పరిశీలించిన మంత్రులు - Telangana animal husbandry minister Talasani

కార్వాన్ నియోజకవర్గం జియాగూడ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్,  మహమూద్ అలీ పరిశీలించారు. రాష్ట్రంలోని అర్హులందరికి ఇళ్లను ఇచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదేనని తలసాని స్పష్టం చేశారు.

అర్హులందరికి రెండు పడక ఇళ్లను ఇస్తాం: మంత్రి తలసాని

By

Published : Nov 7, 2019, 8:08 AM IST

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. రెండుపడక గదుల విషయంలో ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దని మంత్రులు సూచించారు. రాష్ట్రంలోని అర్హులందరికి ఇళ్లు ఇచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదని తలసాని స్పష్టం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. జనవరి 5 నాటికి పూర్తి చేసిన ఇళ్లను పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

అర్హులందరికి రెండు పడక ఇళ్లను ఇస్తాం: మంత్రి తలసాని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details