పురపాలక ఎన్నికల ప్రచారంలో మాటలు ఎన్నైనా చెప్పవచ్చని.. చేతలు మాత్రం 25న ఫలితాల్లో తెలుస్తుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొన్నేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా వెళ్లారని.. ప్రస్తుతం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు.
కొత్త మున్సిపల్ చట్టం కఠినంగా అమలు చేస్తామని.. గ్రీనరీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు కేటీఆర్ వెల్లడించారు. పట్టణ ప్రగతితో.. పట్టణాలను అందగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ఎన్నికలు లేవని కొత్త మున్సిపాలిటీ చట్టం సక్రమంగా అమలు కావాలంటే తెరాసకు ఓటు వేయాలని సూచించారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి దూరంగా ఉండటానికి కాంగ్రెస్, భాజపాలే కారణమని ఆరోపించారు.