రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందేందుకు జల వనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు జల వనరులు, అటవీశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ దిల్లీలో ఇందుకోసం అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,192 కోట్ల ఎలక్ట్రో మెకానికల్ పనులు, రూ.780 కోట్ల వ్యయంతో సివిల్ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి గుత్తేదారులను సైతం ఖరారు చేశారు. దీనిపై కొందరు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. అక్కడ ప్రతికూల తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పనులు ఆగిపోయాయి.
అటవీ, పర్యావరణశాఖ కసరత్తు అనుమతుల కోసం కసరత్తు - Rayalaseema lift irregation project news
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందేందుకు జల వనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు లేఖ రాశారు.
అటవీ, పర్యావరణశాఖ కసరత్తు అనుమతుల కోసం కసరత్తు
కేంద్ర పర్యావరణశాఖ నియమించిన నిపుణుల కమిటీ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ జల వనరులశాఖ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర అటవీశాఖకు దరఖాస్తు చేసింది. పర్యావరణ అనుమతులు అవసరం లేదనుకుంటే పనులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది.
ఇదీ చదవండి:పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస కట్టుబడి ఉంది: కేటీఆర్