కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహం కాస్త తగ్గింది. నారాయణపూర్ జలాశయం నుంచి దిగువకు లక్షా 13 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూరాలకు ఎగువనుంచి నాలుగు లక్షా 34 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... దిగువకు నాలుగు లక్షా 16 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 212 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి 5 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. దిగువకు 5 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.
నాగార్జునసాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 309 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులోకి 4 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 5 లక్షల 23 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.