తెలంగాణ

telangana

ETV Bharat / city

మావోయిస్టులే గంజాయి వ్యాపారస్థులు... మన్యంలో గోడ పత్రిక కలకలం

విశాఖ మన్యంలో గంజాయి సేద్యం, అమ్మకాలకు మవోయిస్టులే ప్రధాన కారణమని... మావోలు, గంజాయి వ్యాపారస్థులతో కమ్మక్కై లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపిస్తూ ఓ గోడ పత్రిక వెలిసింది. అల్లూరి యువజన సంఘం పేరిట వెలిసిన ఈ గోడ పత్రికలో కోండ్రు గ్రామానికి చెందిన వంతాల రామకృష్ణ అనే మావోయిస్టు సానుభూతి పరుడు గంజాయి వ్యాపారస్థులతో లావాదేవీలు చేస్తున్నాడని ఆరోపించారు.

moist wall paper
moist wall paper

By

Published : Aug 13, 2020, 9:17 PM IST

మావోయిస్టులే గంజాయి వ్యాపారులు అంటూ అల్లూరి యువజన సంఘం పేరిట మన్యంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. విశాఖ మన్యంలో మావో ప్రభావిత ప్రాంతం జి.మాడుగుల మద్దిగరువులో.. మావోయిస్టులు గంజాయి వ్యాపారస్థులతో కుమ్మక్కు అయ్యారని అల్లూరి యువజన సంఘం పేరిట గోడ పత్రికలు వెలిశాయి. కోండ్రు గ్రామానికి చెందిన వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అనే వ్యక్తి గంజాయిని ప్రోత్సహించి గిరిజన యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని పోస్టర్ వేశారు.

కాసులు మావోలకు... జైలు శిక్ష గిరిజనులకు, విలువలకు తిలోదకాలు.. స్మగ్లర్లుగా మారిన మావోయిస్టులు.. అని పోస్టర్లలో రాశారు. ఈ నెల 6న వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి వ్యాపారులతో లావాదేవీలు కలిగి లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టులకు కావాల్సిన నిత్యావసర సరుకులు, మందులు అందిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వంతాల రామకృష్ణ నుంచి రూ.1,76,000 నగదు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. ఈ ఘటన ఆధారంగా పోస్టర్లు వెలిశాయని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details