తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.. గాంధీభవన్​లో ఏర్పాట్లు పూర్తి

AICC President Election: రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ​ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం గాంధీభవన్​లో పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. పోలింగ్​ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు​ ఉంటుందని తెలిపాయి. రాష్ట్రంలో 238 మంది పీసీసీ నేతలు ఓటు హక్కు వినియోగించుకుంటారని వెల్లడించింది.

రేపే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.. గాంధీభవన్​లో ఏర్పాట్లు పూర్తి
రేపే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.. గాంధీభవన్​లో ఏర్పాట్లు పూర్తి

By

Published : Oct 16, 2022, 10:03 PM IST

AICC President Election: రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ​ అధ్యక్ష పదవి ఎన్నికకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్​లోని గాంధీభవన్​లో పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. పోలింగ్​ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు​ ఉంటుందని తెలిపాయి. రాష్ట్రంలో 238 మంది పీసీసీ నేతలు ఓటు హక్కు వినియోగించుకుంటారని వెల్లడించింది.

తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత:అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత రాజమోహన్ ఉన్నితన్, అసిస్టెంట్​ రిటర్నింగ్​ అధికారిగా రాజ బగేల్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఏజెంట్లుగా ఖర్గే తరఫున షబ్బీర్ అలీ, మల్లు రవిలు వ్యవహరిస్తుండగా.. శశిథరూర్ తరఫున ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి శ్రీకాంత్, సంతోశ్​కుమార్ వ్యవహరిస్తున్నారు.

ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు:137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ మధ్య పోటీ నెలకొనగా.. 9 వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.

9వేల మందికిపైగా ఓటు వేయనున్నారు:సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక బరిలో లేకపోవడం వల్ల 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ మధ్య పోటీ నెలకొంది. 9 వేల మందికి పైగా కాంగ్రెస్‌ కమిటీ, పీసీసీ ప్రతినిధులు సోమవారం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్ జరగనుంది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details