తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓటుకు నోటు కేసు విచారణ 16కు వాయిదా - ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ఈనెల 16న ప్రారంభించాలని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం నిర్ణయించింది. నిందితులందరూ కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

vote for note case hearing postpone to november
ఓటుకు నోటు కేసు విచారణ 16కు వాయిదా

By

Published : Nov 11, 2020, 7:29 PM IST

ఓటుకు నోటు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ఈనెల 16న ప్రారంభించాలని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం నిర్ణయించింది. ఈనెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కచ్చితంగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఏసీబీ కోర్టు కొట్టివేసి డిశ్చార్జ్ పిటిషన్లపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. తమ ప్రమేయం లేకపోయినప్పటికీ.. ఓటుకు నోటు కేసులో ఇరికించారని పిటిషన్లలో పేర్కొన్నారు.

హైకోర్టును ఆశ్రయించినందున.. అభియోగాల నమోదుకు కొంత గడువు ఇవ్వాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా తరఫు న్యాయవాదులు కోరారు. సండ్ర, ఉదయ్ సింహా అభ్యర్థనపై అనిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లపై ఈనెల రెండో తేదీనే కోర్టు నిర్ణయం వెల్లడించందని.. ఈనెల 4న విచారణ సందర్భంగా నిందితులు ఇదే విధంగా కోరగా.. విచారణ నేటికి(బుధవారానికి) వాయిదా వేసినట్లు అనిశా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు లేనందున అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని అనిశా తరఫు న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనిశా వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈనెల 16న అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ఆ రోజున కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఇవీ చూడండి:ప్రభుత్వ అధికారిపై జిల్లా పార్టీ అధ్యక్షుడి దాడి

ABOUT THE AUTHOR

...view details